కల్వకుంట్లమెట్పల్లి టౌన్, ఏప్రిల్ 25,జనంసాక్షి :తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ముందంజలో ఉన్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు మంగళవారం టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని మెట్పల్లి పట్టణంలోని విఆర్ఎమ్ గార్డెన్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ప్రతినెల రూ 2 వేల చొప్పున ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు రాష్ట్రంలోనే మన కోరుట్ల నియోజకవర్గంలో 70 వేల పై చీలుకు ఆసరా పింఛన్లు వృద్ధులకు వికలాంగులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు వితంతువులకు మంజూరయ్యాయని ప్రతినెల 14 కోట్ల 75 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. శ్రీరామ్ సాగర్ కెనాల్ మరియు వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలో సుమారు 75 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని తెలిపారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులకు రెండు పంటలకు సాగు కోసం పదివేల చొప్పున మన కోరుట్ల నియోజకవర్గంలోని రైతులకు ఇప్పటివరకు 409 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. పేదలకు దేశంలోనే ఏ రాష్ట్రం అందించని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డ కట్నంగా ఒక లక్ష 16 వేల రూపాయలను ఆడపిల్ల తల్లిదండ్రులకు అందిస్తున్నామన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ బరిలో ఉంటారని ఆయనకు మీ ఆశీర్వాదాలు అందించి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు అనంతరం పలు తీర్మానాలను టిఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ లు రానవేని సుజాత సత్య నారాయణ అన్నం లావణ్య అనిల్ మెట్పల్లి ఎంపీపీ మారు సాయి రెడ్డి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ కోరుట్ల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




