Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దివస్ ర్యాలీ

గద్వాల నడిగడ్డ, జూన్ 4 (జనం సాక్షి);తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవo ను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెట్రో కార్స్, బ్లూ కోల్ట్స్ ర్యాలీ ని జిల్లా ఎస్పీ కె. సృజన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా అలంపూర్ ఎమ్మెల్యే వి ఎం అబ్రహాం, జిల్లా పరిషత్ చైర్మన్ కె. సరిత ,టెన్త్ బెటాలియన్ కమాoడెంట్ రామ్ ప్రకాష్ హాజరయ్యారు.
అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వైయస్సార్ చౌక్ నందు పోలీస్ పెట్రో కార్స్, బ్లూ కోల్ట్స్ ర్యాలిని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, జిల్లా పరిషత్ చైర్మన్ కె. సరిత, జిల్లా ఎస్పీ కె. సృజన, టెన్త్ బెటాలియన్ కమాoడెంట్ రామ్ ప్రకాష్, డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, సాయుధ దళ డి. ఎస్పీ పి. ఇమ్మనియోల్ శాంతి కపోతాలను ఎగరవేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.ప్రత్యేక బ్యాండ్ మేళం వాహిద్య సెబ్దాలతో వైఎస్సార్ చౌక్ నుండి ర్యాలీ ప్రారంభం అయి సుంకులమ్మ మెట్టు, న్యూ బస్ స్టాండ్, కృష్ణ వేణి చౌక్, అంబేడ్కర్ చౌక్, కోర్టు సర్కిల్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా PJP పిజెపి క్యాంప్ ముందు గుండా జమ్మిచేడు వరకు వైబవంగ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ ని విజయవంతం చేశారు.
ఈ ర్యాలీ లో జిల్లా ఎస్పీ కె సృజన స్వయంగా పోలీస్ ఇన్నోవా వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆదివారము సురక్షా దినోత్సవం ను పురష్కరించుకుని గత 9 సంవత్సరాలుగా పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసేందుకు ర్యాలీ తో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ముఖ్య మంత్రి పోలీస్ శాఖలో చాలా మార్పులు తీసుకువచ్చారని, అత్యున్నత ప్రమాణాలతో కొత్త పోలీస్ స్టేషన్ల, సర్కిల్ ఆఫీసులు, జిల్లా పోలీస్ కార్యాలయాలు నిర్మించడం ద్వారా పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం సాధించిన కృషి ప్రగతిలో అందరూ భాగస్వామ్యం అవుతామని అన్నారు. ఈ సురక్ష దివాస్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం , ఈ కార్యక్రమం కోసం పోలీస్ అధికారులు, సిబ్బంది చేసిన కృషి,అమూల్యమైనదని , వారందరినీ అభినందించారు.
ఈ ర్యాలీలో గద్వాల, అలంపూర్, శాoతినగర్ సి. ఐ లు చంద్ర శేఖర్, శ్రీనివాస్, శివ శంకర్, ఆర్ ఐ నాగేష్ అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సై లు, పోలీస్ సిబ్బంది , ప్రజలు పాల్గొన్నారు.