Wednesday, 4 November 2026

వ్యవసాయానికి సిద్ధంగా ఉంచే ఒక గొప్ప పండుగ ఏరువాక పౌర్ణమి – సండ్ర

పెనుబల్లి, జూన్ 4(జనం సాక్షి)వ్యవసాయానికి సిద్దంగా ఉంచే ఓ గొప్ప పండుగే ఏరువాక పౌర్ణమి అని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు, ఏరువాక పౌర్ణమి సంధర్భంగా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో ఆదివారం సండ్ర పొలంలో స్వయంగా నాగలి పట్టి దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సంధర్భంగా ఆయన రైతుల నుద్దేశించి మాట్లాడు తూఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం రైతులకు పండుగగా మారాలని ఆకాంక్షించారు, అన్నదాతలు ఈ ఏరువాక పౌర్ణమి పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడంతో ప్రారంభమైన వ్యవసాయ పనులు, ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటు న్నానని అన్నారు, ఈ ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి లక్కినేని అలేఖ్య, జెడ్ పి టి సి చెక్కీలాల మోహనరావు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, చీకటి రామారావు, లక్కినేని వినీల్, మందడపు అశోక్, చింత నిప్పు సత్యం, తేళ్లూరి నాగేశ్వరావు,తదితరులు పాల్గొన్నారు,