వరంగల్ ఈస్ట్, జూన్ 21 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో బుధవారం కొండ సుస్మిత పటేల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉర్సు రోడ్డు (సిటీ ప్యాలెస్) లో గడ్డం యాదమ్మ-జోజి మనమరాలుశ్రీనిధి కి నూతన వస్త్ర ఫలపుష్పలంకరణ కార్యక్రమంలో పాల్గొని నూతన వస్త్రాలు బహుకరించి నిండు మనసుతో ఆశీర్వదించడం జరిగింది.. అదేవిధంగా 37వ డివిజన్ కు చెందిన పస్తం రేవతి ఇటీవల మరణించగా ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఈరోజు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే 39 వ డివిజన్ కు చెందిన ఆర్పి సోమ మాధవి కి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా సర్జరీ (ఆపరేషన్) జరుగగా ఈరోజు వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది…అలాగే తూర్పుకోట, ఖిలావరంగల్ లో మెడుదుల కుమార్ యాదవ్ దశదినకర్మ కార్యక్రమమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నాయకులు నల్గొండ రమేష్, మీసాల ప్రకాష్, షేర్ల కిషోర్ నారగోని స్వప్న మురళి, బెడిదే వీరన్న తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు లో పర్యటించిన సుస్మిత పటేల్




