జనం సాక్షి, కమాన్ పూర్ : అనేక ఏండ్ల సమైఖ్యాంధ్ర పాలనలో వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సమగ్రాభివృధ్ది సాధ్యమైందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా కమాన్పూర్ మండలం గుండారం రైతు వేదికలో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనతో వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. తాగు సాగునీరు, కరెంటు కష్టాలు తీరాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మార్పును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందో మీ కళ్ళ ముందే కనిపిస్తుందని ఇందుకు కమాన్పూర్ మండలమే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్, తాగు, సాగు నీటి కష్టాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టారని, రైతుల ప్రయోజనాల కోసం పెట్టుబడి అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు. గోదావరినది తీరంలో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి దీశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్దపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాల చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయిన తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారధ్యంలో అంకిత భావంతో పని చేస్తుందన్నారు. మండలంలో రైతు బీమా పథకం ద్వార ఐదు సంవత్సరాల కాలంలో రూ. 3 కోట్ల 11 లక్షల ప్రీమియం చెల్లిస్తే ఐదేండ్లలో మరణించిన 87 మంది రైతు కుటుంబాలకు రూ. 4 కోట్ల 39 లక్షలు అందించడం జరిగిందన్నారు. రైతు బంధు పథకం ద్వార 5755 మంది రైతులకు సుమారుగా రూ. 40 కోట్లు పెట్టుబడి సాయంగా అందించడం జరిగిందన్నారు. ఉచిత కరెంటు, సాగునీరు ఎరువుల కొరత లేకుండా నాణ్యమైన విత్తనాలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. అయితే పంట మార్పిడి విధానం పాటించాల్సిన అవసరం ఉందని, వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలను సాగు చేయాలని ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. అంతకు ముందు కమానపూర్ క్రాస్ రోడ్డు నుండి గుండారం రైతు వేదిక వరకు రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మహిళ రైతులతో కలిసి ప్రదర్శనగా రైతు వేదికకు చేరుకున్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వివిధ రంగాల్లో జరిగిన ప్రగతిని వివరిస్తూ గీతాలు ఆలపించారు. ఈ రైతు సదస్సులో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, పీఎస్ఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, గుండారం, కమానపూర్, జూలపల్లి సర్పంచులు ఆకుల ఓదెలు, నీలం సరిత, బొల్లపల్లి శంకర్ గౌడ్, కమానూర్ ఎంపిటిస్ -2 బోనాల నెలకటస్వామి, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రవూఫ్ఖాన్, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసిల్దార్ దత్తు ప్రసాద్, ఏపీఎం శైలజా శాంతి, ఏపీవో శ్రీనివాస్, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సమగ్రాభివృధ్ది సాధ్యమైంది – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




