ముప్కాల్( జనం సాక్షి) జూన్ 12తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా న్యూ అంబేద్కర్ భవన్ నిజామాబాద్ లో “కవి సమ్మేళనాన్ని” నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది కవులను సత్కరించి ప్రశంసా పత్రం మరియు 1116/- తో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్సై తొగర్ల సురేష్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తన కవిత సంకలనాన్ని వినిపించారు ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై కవితా సంకలనాన్ని రచించి వినిపించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, మరియు జడ్పీ చైర్మన్ కిషన్ రావు, కవులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలలో “కవి సమ్మేళనం” లో పాల్గొన్న “పోలీస్ కవి” తొగర్ల సురేష్




