Wednesday, 4 November 2026

పట్టణంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి

హుజూర్ నగర్ జూన్ 22 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపుతో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ అమరవీరులకు పట్టణంలోని అమరవీరుల స్తూపంవద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నినదీస్తూ పూలమాలలతో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలోని టౌన్ హాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన తెలంగాణ అమరవీరులు సోమగాని భరత్ కుమార్ గౌడ్, నందిగామ అంజయ్యల విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ నేడు అనుభవిస్తున్నటువంటి ఈ పదవులు బంగారు తెలంగాణలో పొందుతున్నటువంటి ఈ పథకాలు అన్ని తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగ ఫలమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంక్షేమ పథకాల రూపకల్పన ఒక భాగం అయితే, స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో వాటిని నియోజకవర్గంలో మన తన భేదం లేకుండా బడుగు బలహీన, సబ్బండ వర్గాల ప్రజలకు, ప్రతిపక్షాల నాయకులకు సైతం ప్రతి ఇంటికి చేరవేయడం ఒక భాగమన్నారు. ఇంతటి గొప్ప నాయకులను ప్రజా క్షేత్రంలో ఒకసారి గెలిపించుకొని బంగారు తెలంగాణను భవిష్యత్తును పునర్ణిమించుకొనుటకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, ప్రజాక్షేమ పాలన సాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ గూడెపు శ్రీనువాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి, అట్లూరి హరిబాబు, గోల్డ్ పిచ్చయ్య, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ, వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు, కార్మిక, విద్యార్థి, మహిళ కమిటీల నాయకులు బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు భారీ ఎత్తున పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.