Thursday, 5 November 2026

తెలంగాణ రాష్ట్ర 30వ నీట్ ర్యాంకు సాధించిన వనపర్తి జిల్లా విద్యార్థి దివ్యశ్రీ…

తెలంగాణ రాష్ట్ర 30వ నీట్ ర్యాంకు సాధించిన వనపర్తి జిల్లా విద్యార్థి దివ్యశ్రీ… ఫోటో రైట్ అప్.. 30వ నీట్ ర్యాంకును సాధించిన విద్యార్థిని సన్మానిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి టౌన్ నవంబర్ 20 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా క్యాంప్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర 30వ నిట్ ర్యాంకు సాధించిన వనపర్తి జిల్లా 6వ వార్డు మెట్టు పల్లి కి చెందిన దివ్య శ్రీ కి ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి స్వీట్లు తినిపించారు.మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్ లో విద్యను అత్యున్నత సాయికి తీసుకెళ్లే విధంగా, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్స్ కాగితాల లక్ష్మీనారాయణ, కంచరవి, మరియు నాయకులు రంగం రాములు,జనార్థన్, తదితరులు పాల్గొన్నారు.