Thursday, 5 November 2026

బూరుగడ్డ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

బూరుగడ్డ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 20 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ (మాచవరం) గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆదివరహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్మించిన భక్తుల సౌకర్యార్థం నూతన షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం బూరుగడ్డ (మాచవరం) గ్రామంలో డి ఎం ఎఫ్ టి నిధుల నుండి మంజూరైన రూ. 35 లక్షల పై చిలుకు విలువ గల సి సి రోడ్లుకు, మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీఎస్ స్కూల్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సైదిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ సలీమారంజాన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ముడెం గోపిరెడ్డి, షేక్ అలీ, గూడెపు నాగలింగం, టిఆర్ఎస్ నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు