నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులతో కలిసి శివాజీ నగర్ నందు బడిబాట కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ బడిబాట ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వి. సరిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు,మెరుగుపడ్డాయని,డిజిటల్ విద్య,నాణ్యమైన విద్య,ఉచిత పుస్తకాలు,ఉచిత దుస్తులు,ఉచిత నోటు పుస్తకాలు,రుచికరమైన మధ్యాహ్న భోజనం,ప్రభుత్వ పాఠశాలలో అందుతుందని కావున ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలు చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రణపంగ నాగయ్య,ఇంజమూరి వెంకటయ్య, ఉపాధ్యాయులు నర్సకుమారి,వెంకటేశ్వరరావు ప్రభాకర్ రెడ్డి,రషీద్ ఖాన్, అన్నపూర్ణ, కళ్యాణి, భవాని, స్రవంతి,లాల్ సాబ్,సరస్వతి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను. చేర్పించాలి. తహశీల్దార్ సరిత




