Tuesday, 3 November 2026

తెలంగాణ రైతు చరిత్రలో మరో ముందడుగు

బీమా కోసం ఎల్‌ఐసితో ఒప్పందం

తెలంగాణ రైతుకు 5లక్షల బీమా

ఆగస్ట్‌ 15 నుంచి అమలుకు నిర్ణయం

తానూ బీమా తీసుకుంటానన్న సిఎం కెసిఆర్‌

తెలంగాణ పంటలకు డిమాండ్‌ రావాలని ఆకాంక్ష

పోచారం హయాంలో రైతులకు అంతా మంచి జరుగుతోందని ప్రశంస

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ రైతు చరిత్రలో మరో అడుగు పడింది. రైతుబంధుతో ఆర్థిక సాయం అందించిన కెసిఆర్‌ ప్రభుత్వం తాజాగా జీవిత బీమా విషయంలో అడుగు వేసింది. ఎల్‌ఐసితో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వారికి భరోసా కల్పించింది. ఈ పథకం ఆగస్ట్‌ నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ మాది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర రైతాంగమంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రైతులకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని,ఆయన లక్ష్మీ పుత్రుడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగాఅభినందించారు. పథకానికి సంబంధించి ఎల్‌ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ. ఇది విశ్వసనీయత, విస్త్రృతి ఉన్న సంస్థ. నా జీవితంలో నేను చేసిన గొప్ప పని రైతు జీవిత బీమా. 18 నుంచి 60 ఏళ్లలోపు రైతులు దురుదృష్టవశాత్తు ఎలా మరణించినా బీమా వర్తిస్తుందని అన్నారు. తెలంగాణ రైతుల తరపున ఎల్‌ఐసీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీతో రైతుబీమా పథకం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎల్‌ఐసీ చాలా నమ్మకమున్న సంస్థ అని సీఎం పేర్కొన్నారు. ఎల్‌ఐసీ విశ్వసనీయ, విస్తృతి ఉన్న సంస్థ అని చెప్పారు. ఏడాది ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు అవుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లో పాలసీ క్లెయిమ్‌ అవుతుంది. ఆగస్టు 15లోపు పత్రాలన్నీ నింపి ఎల్‌ఐసీకి అందజేయాలి. వ్యవసాయ అధికారులు మాత్రమే రైతులకు బీమా పత్రాలు పూర్తి చేసి ఇవ్వాలి. నామినీ వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలి. రైతులు తమ పేరును పూర్తిగా రాయాలి. ఇంటిపేరు, పూర్తిపేరు, మహిళా రైతులు అయితే భర్త పేరు రాయాలి. వ్యవసాయ అధికారులకు ఐప్యాడ్‌లు అందజేస్తాం. రైతులందరి పేర్లు ఐప్యాడ్‌లలో ఉండాలి. రైతులతో కలిసిమెలిసి ఉండి.. వారి ఇండ్లలోనే తినే పరిస్థితిరావాలన్నారు. ఇకపతోఏ సమన్వయ సమితులు ఈ కార్యక్రమంలో పక్కాగా పనిచేయాలన్నారు. తెలంగాణలో పంటలకు మార్కెట్‌ డిమాండ్‌ రావాలని సిఎం అన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి. వరి నాటే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తాం. వీలైనంత త్వరగా రైతు వేదికలను నిర్మించాలని ఆదేశించారు. రైతుల్లో ఐక్యత సాధించాలి. తెలంగాణ రైతాంగం తరపున ఒక మార్కెట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రైతుబంధు పథకంలో అధిక ఆదాయం ఉన్నవాళ్లను డబ్బులు తీసుకోవద్దని కోరాను అని సీఎం తెలిపారు. రైతుబంధు పథకంలో నాతో పాటు చాలా మంది డబ్బులు తీసుకోలేదు. కానీ రైతుబీమా నేను తీసుకుంటా.. కచ్చితంగా అందరూ తీసుకోవాలని సీఎం సూచించారు. రైతుల కోసం బ్జడెట్‌లో పెట్టిన నిధులు రైతులకే ఖర్చు చేస్తామని అన్నారు . ల్గ/తుబంధు పథకం అమలుతో రాష్ట్రంలో 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని హిందూ దినపత్రిక రిపోర్టు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులున్నరు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరిందని చెప్పారు. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులు 32 లక్షల మంది ఉన్నారు. రైతుబంధు పథకంతో కొన్ని పార్టీలు దివాళా తీశాయన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు కాలం కూడా విద్యుత్‌ కోత ఉండదన్నారు. నీళ్లు లేని చోట కొంత సమస్య వచ్చినా.. నీళ్లు ఉన్న చోట పంట బాగా వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 19 దాటితో రైతు ఆకాశానికి ముఖం పెట్టి చూడడు అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో నిరంతరాయంగా చెరువుల్లో నీళ్లురైతుకు కులం లేదని ఎవరు వ్యవసాయం చేస్తే వారే రైతని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తెలిపారు. రైతులు ఇప్పటికి అప్పుల్లోనే వున్నారని చెప్పారు. రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. 2019 తరువాత కాళేశ్వరం పూర్తవుతుందని, వానల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పని లేదని మండిపడ్డారు. పైసా ఖర్చు లేకుండా రైతులందరికీ బీమా ఇస్తున్నామని వివరించారు. సీజన్‌ వచ్చిందంటే మళ్లీ అప్పుకోసమే రైతులు వెతుకుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంట్‌ కోతలు ఉండవని, ఇక జనరేటర్లు అవసరం లేదన్నారు. నీటి కొరత లేని తెలంగాణెళి తన లక్ష్యమన్నారు. 60 ఎకరాల రైతు హైదరాబాద్‌లో కూలీ చేస్తున్నాడని, 60 ఎకరాలు ఉండి ఏం లాభం, నీళ్లు లేవు కరెంట్‌ రాదనికెసిఆర్‌ తెలిపారు. రైతుల బాధలు చూడలేక ఎన్నోసార్లు ఏడ్చినం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. రైతుబంధు పథకంతో కొన్ని పార్టీలు దివాళా తీశాయన్నారు. పేరుకే పెద్ద రైతు.. వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలి. రైతు క్షేమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతు పెట్టుబడి కోసం వెతుక్కునే దుస్థితి రావొద్దు. నాణ్యమైన కరెంట్‌.. కడుపునిండా నీళ్లు.. మద్దతు ధర ఉంటే రైతులకు ఎలాంటి కష్టాలురావు. అయితే పంటకు మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సీఎం తెలిపారు. కానీ తెలంగాణ రైతుల పండించిన పంటకు డిమాండ్‌ రావాలని, అంకాపూర్‌ ఆదర్వం కావాలని మరోమారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్‌ఐసి అధికారులు, రాష్ట్ర వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.