గంగారం జూన్ 13 (జనం సాక్షి)రైతాంగానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను 75% సబ్సిడీపై ప్రభుత్వమే అందించాలి. అఖిల భారత రైతుకుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బుర్కా వెంకటయ్య డిమాండ్.అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం గంగారం మండల కార్యవర్గం ఆధ్వర్యంలో గంగారం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ కి రైతాంగ సమస్యలతో కూడిన మెమోరండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా బూర్క వెంకటన్న మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వం రైతులకు ఇంతవరకు అందించగాపొగా మరొకవైపు నకిలీ విత్తనాలు అప్పుడే రైతుల ముంగిట్లోకి వచ్చేసాయని. అక్కడక్కడ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీలు నిర్వహించి. అనుమతి లేని పెటిలైజర్ షాపులను వెంటనే సీజ్ చేయాలని వారు అన్నారు.
పంటల దిగుబడిలో విత్తనాలదే ప్రధాన పాత్ర అలాంటి విత్తనాలను నాణ్యత ప్రమాణాలతో రైతులకు అందించే ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం లేదు అనిరైతాంగానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను 75% సబ్సిడీపై ప్రభుత్వమే అందించాలినకిలీ విత్తనాలను అరికట్టాలి రైతులకు అవసరమైన ఎరువులను సబ్సిడీపై ముందుగానే అందించాలి.క్రిమి సహకార మందుల ను కల్తిని అరికట్టాలి.రైతులకు అవసరమైన పంట రుణాలను 100% బ్యాంకుల ద్వారా ఇవ్వాలి లక్ష రూపాయల రుణమాఫీని వడ్డీతో సహా వెంటనే ప్రభుత్వం చెల్లించాలి.సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి ఈ సంవత్సరం ప్రకటించిన తక్షణపంట నష్టపరిహారాన్ని వెంటనే అందించాలి. వ్యవసాయ పరికరాలను 75% సబ్సిడీపై రైతులకు అందించాలి.
ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన పంటల డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి.
పంటల ప్రణాళికను తయారుచేసి అన్ని పంటలకు ముందుగానే మద్దతు ధరలు ప్రకటించాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని రైతు రుణ విముక్తి చట్టాన్ని తక్షణమే పార్లమెంట్లో అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కామ్రేడ్ పుల్లన్న. వజ్జ సమ్మక్క పి ఓ డబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి. అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు ఈసం జగ్గారావు.రవి. వెంకన్న. ఈసం రాజు. రవీందర్. వజ్జ సుభద్ర.తదితరులు పాల్గొన్నారు.




