Wednesday, 4 November 2026

తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా పంచాయతీ కార్మికులకు సన్మానం చేసిన రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్ మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షి వికారాబాద్ నియోజకవర్గం లోని మోమిన్ పేట మండల పరిధిలోని చిన్నకోల్కుందలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి సురేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు పూలమాలలు వేసి, శాలువాలా కప్పి ప్రగతిపత్రాలతో సన్మానించారు. పల్లె ప్రగతిలో. పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని సర్పంచ్ సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమిత్ర, లలిత, సిద్ధప్ప, రాజు, రత్నమాల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షివికారాబాద్ నియోజకవర్గం లోని మోమిన్ పేట మండల పరిధిలోని చిన్నకోల్కుందలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి సురేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు పూలమాలలు వేసి, శాలువాలా కప్పి ప్రగతిపత్రాలతో సన్మానించారు. పల్లె ప్రగతిలో. పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని సర్పంచ్ సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమిత్ర, లలిత, సిద్ధప్ప, రాజు, రత్నమాల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.