తెలంగాణ సంస్కృతి సారధి ఆధ్వర్యంలో ఆరోగ్యం, సోషల్ మీడియా వల్ల కలిగే అనార్ధాలపై విద్యార్థులకు అవగాహన
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (20): తెలంగాణ సంస్కృతి సారధి వనపర్తి జిల్లా తరఫున గోపాల్ పేట్ మండలంలోని ఏదుట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య జాగ్రత్తలు విధేయత గొప్పతనం సోషల్ మీడియా వల్ల కలిగే అనర్ధాలు అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాల పట్ల సాంస్కృతి సారధి బృందం తమ యొక్క ఆటపాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, సంస్కృతి సారథి సభ్యులు శివలింగం, శ్రీనివాసులు, కృష్ణయ్య, సువర్ణ, రాధా, ఉపాధ్యాయులు నరేంద్ర చారి, కురుమన్న, దామోదర్ రెడ్డి, గోపాల్, శ్రీదేవి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




