Saturday, 7 November 2026

సిసి కెమెరాలు బిగింపు ఎప్పుడు ఆరు నెలలు

సిసి కెమెరాలు బిగింపు ఎప్పుడు ఆరు నెలలు అవుతున్న పట్టించుకోని కౌన్సిలర్ జనం సాక్షి (సిరిసిల్ల టౌన్)
సిరిసిల్ల పట్టణం 12వ వార్డుకు సీసీ కెమెరాలు మంజూరు అయి ఆరు నెలలు అవుతున్న కౌన్సిలర్ వాటిని బిగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని వార్డు ప్రజలు పేర్కొన్నారు అలాగే ఓపెన్ జిమ్ పనులు కూడా ఇంతవరకు మొదలు పెట్టకుండా స్థానికులకు అందుబాటులో ఉండకుండా కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి టూర్లు తిరగడంపై ప్రజలు మండిపడుతున్నారు పక్క వార్డు అయిన ఒకటో వార్డులో సీసీ కెమెరా బిగింపు ఓపెన్ జిమ్ పనులు ఎప్పుడో అయిపోయాయని వార్డులో సీసీ కెమెరాలు బిగించాలని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు వార్డులో అసాంఘిక సంఘటనలు జరిగిన ఏదైనా దొంగతనాలు జరిగిన పరిశీలించడానికి ఒక కుడలి లో కూడా ఇప్పటివరకు ఒక సీసీ కెమెరా లేకపోవడంపై స్థానిక వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు