వికారాబాద్ రూరల్ మే 05 జనం సాక్షినూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి 125 అడుగుల భారీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని డిలైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే దళితులకు దళిత బంధం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వ్యవసాయ రైతులకు రైతుబంధు రైతు భీమా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు అని అన్నారు ఆసరా పింఛన్లు ప్రవేశపెట్టి 2016 మూడు వేల 16 తో రూపాయలతో నిరుపేదలకు ఒంటరి మహిళలకు ఆకలిగా నిలిచిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు వికారాబాద్ ప్రాంతంలో స్థాపించబోయే మెడికల్ కళాశాలలో క్షయ వ్యాధి రోగులకు ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణం లేదా మెడికల్ కళాశాలలోని క్షయ యాదిగ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు అందించే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు వికారాబాద్ కి హవా లాకో మరిజొ కి దవా అనే విధంగా క్షయ వ్యాధి రోగులను నగరానికి తరలించకుండా ఇక్కడే వైద్య పరీక్షలు చేసే పరికరాలు సిద్ధం చేసి వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న డాక్టర్ తుప్ప ఆనంద్ వికారాబాద్ ప్రజలు వెన్నంటే ఉన్నారని ఆయన తెలిపారు ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తుప్ప ఆనంద్ అని వికారాబాద్ ప్రజలు ఆయనను ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఏది ఏమైనా వికారాబాద్ నియోజకవర్గానికి సరియైన నాయకుడు ప్రజా బంధు తుప్ప ఆనంద్ అని ప్రజలు పేర్కొంటున్నారు




