Thursday, 5 November 2026

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మొబైల్ సైన్స్ ఎక్స్ భిషన్

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట శామీర్పేటలో శుక్రవారం రోజు మొబైల్ సైన్స్ ఎగ్జి బిషన్ను నిర్వహించారు. జీన్-హెల్త్ కనెక్ట్ అనే పేరుతో మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను సిసిఎంబి హైదరాబాద్ మరియు విశ్వేశరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం, బెంగళూరు ( ఎన్ సి ఎస్ ఎం యొక్క ఒక యూనిట్) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు కళాశాలలో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.. ఎన్నో రకాల జన్యు సంబంధం మార్పులు రకరకాల వంశపారంపర్య సంక్రమణాలు సంబంధించిన విషయాల గూర్చి ఈ ఎగ్జిబిషన్ లో పొందుపరిచారు. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆరోగ్యం పట్ల అవగాహన ఆసక్తి పెరుగుతుంది అని ఇలాంటి కార్యక్రమాలు నిత్యం నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.