చెన్నూర్ మండలం బాబురావుపేట శివారు స. ర్వే నం 8 లో గల 27 ఎకరాల అసైడ్ మెంట్ భూములు భూ కబ్జా దారులు,భూ మాఫీ మూటలు కబ్జా చేసుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంది.
పేదలకు చెందవలసిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న స్థానిక అధికారులు ప్రభుత్వ,అసైన్డ్ మెంట్ భూములను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవరస్తున్నారు.
ప్రభుత్వ,అసైన్డ్ మెంట్ భూములను కాపాడి,
పేదలకు ఇంటి స్థలాలుగా పంచాలి కొరుతు కోరుతు అధికారులకు వినతి పత్రాలివ్వడం జరిగింది.
పలితం రానందున పేదలు గుడిసెలు వెయ్యడం జరిగింది.
భూ కబ్జాదారులు పోలీస్ అధికారులపై రాజకీయ ఒత్తిడి చేయించి 22 మంది పైన ప్రతి ఒక్కరికీ పైన మూడు కేసులు పెట్టడం జరిగింది.కేసులు మోపబడ్డవారిలో 18 మంది మహిళలు బాధితులుగా ఉన్నారు.
ప్రభుత్వ భూములు కాపడేవారిపైన కేసులు పెట్టి, కబ్జాదారులకు స్వేచ్ఛ కల్పించడంతో భూముల్లో దున్నడం,కంచెలు వెయ్యడం జరుగుతుంది.
అసైన్డ్ మెంట్,ప్రభుత్వ భూములను కాపాడాలని
పేదలు గత 13 రోజులుగా ఎర్రటి ఎండలో ఉంటున్నారు.తేది:2/5/2023 న స్థానిక తహసీల్దార్ కు, తేది:3/5/2023 జిల్లా కలెక్టర్ కు పేదలు,సీపీఎం నాయకత్వం వినతి పత్రాలివ్వడం జరిగింది.
కానీ భూములను కాపాడటం కోసం నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కబ్జాదారులు రెచ్చిపోవడం జరుగుతుంది.ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలు బిఆరెస్ పార్టీకే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఓట్లు వేసి గెలిపించిన పేదలు.వారికి తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు/ఇంటి స్థలం,నిర్మాణం కోసం రూ.5 లక్షల రూపాయలు ఇవ్వవలసిన బాధ్యత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ఉన్నది.
అసైన్డ్ మెంట్,ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు ఇంటి స్థలాలివ్వడం కోసం జిల్లా కలెక్టర్,ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ ను జోక్యం చేసుకొని పేదలకు న్యాయం చెయ్యలేని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.
విలేకర్ల సమావేశంలో పాల్గొన్నవారు సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి,దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు.ప్రేమ్ కుమార్ పట్టణ నాయకులు.




