Thursday, 5 November 2026

నూతనంగా నిర్మించిన ఐ డి ఓ సి భవన సముదాయము, కలెక్టర్ క్యాంప్ కార్యాలయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, మే 12 (జనం సాక్షి);నూతనంగా నిర్మించిన ఐ డి ఓ సి భవన సముదాయం,కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల ప్రారంభం త్వరలో జరుగు తున్నందున అధికారులు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అన్ని విభాగాలలో ఏర్పాట్లు, ఫర్నిచర్ ఇతర సదుపాయాల ఏర్పాటుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ హాలు నందు అధికారులతో మాట్లాడుతూ అందరూ అధికారులు ఏ సమయంలో అయిన ఐ డి ఓ సి భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒక్కో ప్రభుత్వ శాఖ ద్వారా పనులు అన్ని పూర్తి చేయాలన్నారు.మళ్లీ ప్రారంభించే తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. హార్టికల్చర్ శాఖ ద్వారా భవనం బయట, లోపల మొక్కలు గ్రీనరీ, డయాస్పై ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారులు భవనాల శాఖ రెడ్, గ్రీన్ కార్పెట్ హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇతర వసతులు కల్పించాలన్నారు. ఈ డి ఎస్ సి అభివృద్ధి శాఖ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత గురువుల ఆధ్వర్యంలో సర్వమానవ సౌభ్రాతృత్వం ఆశీస్సులు కార్యక్రమం ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపాలిటీ వారు శానిటేషన్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఏడి చేనేత శాఖ విఐపి లకు శాలువాలు ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో, తాసిల్దారు ప్రోటోకాల్ ప్రకారంగా ఆహ్వానితుల పేర్లు, ఇన్విటేషన్ ఏర్పాటు చూడాలన్నారు. ఆహ్వానితులను సన్నాయి మేళంతో ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రూప్ ఫోటోకు సంబంధించిముందు రోజే ట్రయల్ ఏర్పాటు చూడాలన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు ప్రాజెక్టు ఇతర పనులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు.అధికారులంరు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్ల చేయాలనీ ఆదేశించారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.