తెలంగాణ సాంఘీక
సంక్షేమ గురుకుల మహిళ కళాశాలలో ఎన్ సి సి బృందం :శామీర్ పేట్, జనంసాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించుటకు ఎన్ సి సి విభాగం నుండి డాక్టర్ వి.వేణుమాధవ్ , డాక్టర్ ఎస్. లలిత ,అశ్విని , అర్చన ,కృష్ణవేణి , మరియు 50 ఎన్ సి సి విద్యార్థులు భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ బృందం బుధవారం విచ్చేశారు . ఈరోజుల్లో విద్యార్థులు సమాజాన్నిఎలాఎదుర్కోవాలి. సంఘం లోఎదుర్కొంటున్న వివిధ రకాల లింగ వివక్షత హింసల గురించి మరియు మనకు మనమే ఎలా సరిహద్దులను సృష్టించుకోవాలో ఒక డ్రామా ద్వారా విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. కృష్ణవేణి ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.
21ఎస్పీటీ -1: ఎన్ సి సి బృందంతో అధ్యాపకులు
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ కళాశాలలో ఎన్ సి సి బృందం




