జనం సాక్షి, చెన్నరావు పేటఎల్లయగూడెం గ్రామానికి చెందిన గౌడ సంఘ కుల పెద్ద మనిషి గంధం బుచ్చి రాములు బిఆర్ఎస్ కి రాజీనామా చేసి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు చిప్ప ఈశ్వర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్భంగా దొంతి మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం అవలంబించే రైతు వ్యతిరేక విధానాలు ,ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక బీఆర్ఎస్ ని ఓడించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని దొంతి మాధవరెడ్డి అన్నారు.





