Wednesday, 4 November 2026

తెలంగాణ సాధనకు రౌండ్‌టేబుల్‌ సమావేశం: గజ్జెల కాంతం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావలని తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం అభిప్రాయపడింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నేతలు ఈ సమావేశంలో సూచించారు. ఆగస్టు 31న హైదరాబాద్‌లో తాము నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు అందరూ మద్దతు ఇవ్వాలని ప్రజాసంఘాల ఐకాస అధ్యక్షుడు గజ్జెల కాంతం కోరారు. జూబ్లీహాల్‌లో తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస అధ్యక్షుడు గజ్టెల కాంతం ఉద్యమకార్యచరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు తొలివారంలో పార్లమెంట్‌ను తెలంగాణ అంశంపై తమ పార్టీ స్తంభింపజేస్తుందని భాజపానేత దత్తాత్రేయ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *