బచ్చన్నపేట జనవరి 18 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు ఏనుగుల సత్తయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ నియోజకవర్గ ఇన్చార్జి రామిని నరేష్. రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేష్. టిడిపి మండల కన్వీనర్ శ్రావణ బోయిన బాల నర్సయ్య లు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడని అలాంటి వర్గాల వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది ఎన్టీ రామారావు అని అన్నారు కూడు గూడు నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ తెలంగాణలో టిడిపి అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరె బాలయ్య. మేక కొమురయ్య. పైసా బిక్షపతి. రాగిశెట్టి కిషన్. బండారి పోశయ్య. గుర్రాల రవీందర్ రెడ్డి. మట్టి బిక్షపతి ఉన్నారు
బచ్చన్నపేటలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి




