Wednesday, 4 November 2026

బై0సాలోగలఅనధికార లేఔట్లు పై లోకయుక్త లో ఫిర్యాదు

బై0సాలోగలఅనధికార లేఔట్లు పై లోకయుక్త లో ఫిర్యాదు….

భైంసా రూరల్ జనవరి 05 జనం సాక్షి

 

– లోకాయుక్త కమిటీ ఫిర్యాదు మేరకు హాజరైన అధికారులు…

– అనధికార లేఔట్లపై అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చిన బాలాజీ సూత్రావే…

 

నిర్మల్ జిల్లా బైంసాపట్టణంలో అనాధికార,అక్రమ లేఔట్లు కుప్పలుగాకుప్పలుగా వెలిసిన అధికారులచర్యలుమాత్రం అంతంత మాత్రమే ఉన్నాయ0టూ… భైంసా పట్టణానికి చెందిన బాలాజీ సూత్రావే లోకయుక్త లో ఫిర్యాదు చేశారు. 2019 మున్సిపల్ ఆక్ట్ ప్రకారం మున్సిపల్ పరిధిలో తగిన నిబంధనల ప్రకారం లేఅవుట్లు చేయాల్సి ఉండగా…వెంచర్ల యజమానులతో,అధికారులు నాయకులు కుమ్మక్కై దొడ్డిదారినివెతికి 2020 ఆగస్టు నుండి 2021 జులై వరకు కాంపౌండ్ వాల్( బౌండరి వాల్) పర్మిషన్ తో రిజిస్ట్రేషన్లు కొనసాగించారు.దీనికి వత్తాసు పలికిన నాయకులు,రిజిస్టర్ లపై భైంసా పట్టణం బాలాజీ సూత్రావె ప్రజలు ఇబ్బంది పడొద్దు అని ఉద్దేశంతో హైదరాబాద్ లోని లోకాయుక్త లో కేసువేసి విచారణ జరిపించవలసిందిగా కోరాడు.ఏట్టకేలకు ఈ కమిటీ సిఫార్సు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వరంగల్ శ్రీధర్ జనవరి 2న బైంసా పట్టణానికి హాజరై అనధికార అక్రమ లేఔట్ల లపై ఫిర్యాదుచేసిన సూత్రావేని సంప్రదించారు.దానికి సంబంధించి సర్వేనెంబర్ పలు సర్వే నంబర్లను, రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ తో సహావారికి స్టేట్మెంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీని తీసుకోన్నారు.దీనిపై అన్ని విధాలుగా, అన్ని కోణాలలో విచారణ జరిపి తొందర్లోనే చర్యలు తీసుకుంటామని సూత్రావేకి హాజరైన అధికారులు హామీ ఇచ్చారు.

 

సామాన్య ప్రజలు నష్టపోవద్దని నా పోరాటం

– బాలాజీ సూత్రవే.

అక్రమ వెంచర్లలో ప్లాట్లనుకొని సామాన్య ప్రజలు నష్టపోవద్దని ఉద్దేశంతో నా పోరాటం కొనసాగిస్తున్నానని బాలాజి సూత్రావే పేర్కొన్నారు. కాంపౌండ్ వాల్ పెర్మిషన్తో రిజిస్ట్రేషన్లు చేయడం తప్పు మార్గమని,అ0తేకాకుండా 2021 సంవత్సరంలో కోర్ట్ పర్మిషన్తో కొన్ని వెంచర్ల లోని ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు అవ్వగా అలాంటి రిజిస్ట్రేషన్లు కూడా ప్రజలకు ఇబ్బందిగా మారుతాయని పేర్కొన్నారు.కోర్ట్ నిబంధనలు ప్రకారం చేసిన రిజిస్ట్రేషన్లలో భవిష్యత్తులోఅవసరమైనప్పుడు కొన్న ప్లాట్లలో నుండి రోడ్డు నిమిత్తం స్థలం కేటాయించవలసిందిగా ఉందని తెలిపారు. కాబట్టి ప్రజలు అన్ని రకాల అనుమతులు ఉన్న లేఔట్ లోనే ప్లాట్లు కొనవాల్సిందిగా కోరారు.