హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈ నెల 10వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. జనవరి 1న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తొలిసారిగా సెలవును తీసుకుంటోంది.
తెలంగాణ హైకోర్టుకు 7నుంచి సంక్రాంతి సెలవులు




