జయంతి సభలో హోంమంత్రి నాయిని వెల్లడి
హైదరాబాద్,మే28(జనం సాక్షి ): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ తెలంగాణ సమరయోధుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టాలన్న యోచనలో ఉన్నామని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన ప్రముఖ సాహిత్యాకరుడు కూడా కావడం వల్ల ఆయన పేరే సముచితమని అన్నారు. ఇందుకు త్వరలోనే తగిన నిర్ణయం తసీఉకునే అవకావం ఉందన్నారు. ట్యాంక్‌బండ్‌పై సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతాపరెడ్డి విగ్రహానికి నాయిని నర్సింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. తెలుగు సాహిత్యాభివృద్ధికి ప్రతాపరెడ్డి ఎంతో సేవ చేశారని కొనియాడారు. గొల్కొండ పత్రికను స్థాపింపి నాటి నిజాం నిరుంకుశత్వాన్ని ఆయన నిలదీశారని నాయిని అన్నారు. సురవరం పేరిట నగరంలో ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తామని నాయిని తెలిపారు. ఆయన సేవలకు గుర్తుగా తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరుపెట్టే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్‌లో సురవరం పేరువిూద ఒక ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. 1896, మే 28న జన్మించి.. 1953, ఆగస్టు 25న స్వర్గస్తులయ్యారు.
తెలుగువర్సిటికీ సురవరం పేరు




