Tuesday, 3 November 2026

తేనెటీగలు దాడి నుంచి తప్పించుకోబోయి…

అనంతపురం: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు. ఆ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ సమీపంలోని రహదారిపై చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లెకు చెందిన జయచంద్ర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే శుక్రవారం ఉదయం ఎల్లుట్ల – మడ్డిపల్లి రోడ్డు సమీపంలో ట్రాక్టర్లో రాళ్లు నింపడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తేనెతుట్టే కదిలి…జయచంద్రపై  దాడీ చేశాయి. దాంతో పారిపోయే క్రమంలో రోడ్డుపైకి వేగంగా పరిగెత్తాడు. అంతలో వేగంగా వస్తున్న మీని లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *