హైదరాబాద్ (జనంసాక్షి ) : హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు స్వైన్ ఫ్లూ భారిన పడ్డారని ఎన్ పీఏ డైరెక్టర్ అరుణ బహుగుణ తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి భారిన పడ్డ ట్రైనీ ఐపీఎస్ అధికారుల ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన చెప్పారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని బహుగుణ తెలిపారు.




