Wednesday, 4 November 2026

తొలకరితో పులకరించే రైతన్న

పుడమితో అనుబంధంతో ఏరువాకకు సిద్దం

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): తొలకరి రాకతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చినుకు రాలగానే గత కాష్టాలను మరచిపోయి మళ్లీ కాడి అందుకునే తత్వం రైతులది. అందుకే ఏటా ఎన్ని కష్టాలు వచ్చినా పంటిబిగువున దిగమింగుకుని నమ్ముకున్న భూమితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగుతాడు. రైతుల కోసం చినుకు పడితేనే భూమి చిగురిస్తుంది. పుడమి పులకరిస్తుంది. మట్టి వాసనలు పరిమళిస్తాయి. రైతు ఆనందిస్తాడు. గత అనుభవాలు ఆనందంగా లేకున్నా రైతు ఎప్పుడూ తలవంచడు. అందుకే అరకపట్టి దున్నడానికి సిద్దం అవుతున్నాడు. విత్తనాలు వేసేందుకు ఏరువాకకు సిద్దమయ్యాడు. గతంలో పంటలు దిగిబడి తగ్గాయనో లేదా పంటలకు గిట్టుబాటు ధరలు రాలేదనో ఏనాడు వెన్నుచూపలేదు. కష్టనష్టాలను భరిస్తూ ముందుకు సాగడమే రైతులకు తెలుసు. అందుకే చినుకు పడగానే లేచి నిలబడ్డాడు. రైతు విశ్రమిస్తే మనకు నోట్లో ముద్ద దిగదని గుర్తుంచుకోవాలి. రైతు అలిగితే మన పనిసున్నా అని భావించాలి. అందుకే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరూరా పని ఉంటుంది. రైతులు,అతనిపై ఆధారపడ్డవారు లేచి నిలబడతారు. ఊళ్లో కాయకష్టం చేసుకునే వారు బతుకుతారు. గ్రావిూణ ఆర్థికక వ్యవస్థబతికి బట్టకడుతుంది. అందుకే గ్రామాలను బాగుచేయడమే లక్ష్యంగా సాగాలి. గ్రావిూణ వృత్తులకు ప్రోత్సాహంతో పాటు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు అండగా నిలవాలి. చెరువుల పునరుద్దరణ, చేపల పెంపకం, పాడిపశువుల పెంపకం, గొర్లు మేకల పెంపకం ఇలా అన్ని రంగాలు సమన్వయంతో సాగాలి. అప్పుడే పల్లె పచ్చగా ఉంటుంది. ఇవన్నీ విస్మరించడం వల్లనే ప్రస్తుతం విపరీత ధోరణులను ఎదుర్కొంటున్నాం.