తొలిమెట్టు పర్యవేక్షణకు నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలను ఉపసంహరించాలి
– టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, నవంబర్ 29( జనం సాక్షి): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతుల పఠన సామర్థ్యాలను పెంపొందించే దిశగా అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికినీ పిల్లల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు అమలు చేస్తున్నారని,ఈ విధానం అమలును పర్యవెక్షించుటకు రాష్ట్ర స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు మానిటరింగ్ చేస్తున్నారని,వారు గమనించిన మంచి,చెడులను ఉపాధ్యాయులతో మాట్లాడుతూ,ఇంకా బాగా జరగాలని ప్రోత్స హిస్తున్నారని,వారికి అభినందనలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. కానీ వీరందరూ పర్య వేక్షణ చేస్తున్నది కాదని,అదనంగా మళ్ళీ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం సమంజసం కాదని,ఇప్పటికి ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని,పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని,పాఠశాలలు ప్రారంభం అయి ఇప్పటికీ ఆరు మాసాలు పూర్తి కావస్తున్న ఇంకను పాఠశాలలకు గ్రాంట్లు విడుదల కాలేదని, ఎఫ్.ఎల్.ఎన్ అమలు చేయుటకు కనీసం తరగతికి ఒక్క ఉపాధ్యాయుడు కావాలని,భారం అయినప్పటికీ ఉపాధ్యాయులు కష్టపడుతూ అమలు చేస్తున్నారని,ప్రతి పాఠశాలకు అన్ని సౌకర్యాలను,తరగతికి ఒక్క ఉపాధ్యాయున్ని నియామకం చేసిన తర్వాత టాస్క్ పోర్స్ ఏర్పాటు చేయాలని,ఇకనైనా ప్రభుత్వం వెంటనే టాస్క్ ఫోర్స్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.




