ఉదయమే గ్రామాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన పార్టీల నేతలు
సాయంత్రం వేళల్లో కుల సంఘాలతో మంతనాలు
హైదరాబాద్,మే4(జనంసాక్షి): ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో తొలఘట్టానికి శనివారం తెరపడింది. సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ఉదయం నుంచే నేతలు గ్రామాలకు చేరుకుని ప్రచార ఉధృతి చేపట్టారు. తొలిదశలో జరుగున్న గ్రామాల ప్రలను నేరుగా కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ప్రచార పర్వం తారా స్థాయికి చేరింది. అభ్యర్థుల గెలుపునకు పార్టీల్లో వ్యూహాలు జోరందుకున్నాయి. దీంతో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పర్వం రసకందాయంలో పడింది. తొలి విడతగా ఈ నెల 6న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 5 గంటలతో మైకులు మూగబోయయి. గ్రామాల్లో ఉపాధి హావిూ పనులు కొనసాగుతున్నాయి. కూలీలందరూ ఉదయం 7 గంటలకే పనులకు వెళ్తున్నారు. వందలాది మంది ఒకే ప్రాంతంలో ఉండడంతో వారిని ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. తమని గెలిపిస్తే విూరు ఏది కోరుకుంటే అది చేసి పెడతామంటూ హావిూల వర్షం కురిపిస్తున్నారు. కూల్డ్రింక్స్ సీసాలను, వారు తాగడానికి గ్లాసులను అందజేస్తున్నారు. కూలీలతో కలిసి కాసేపు ఒక చోట గడ్డపార పట్టడం..మరో చోట పారతో మట్టి ఎత్తిపోయడం.. ఇంకో చోట వారితో కలిసి భోజనాలు చేయడం.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
శుక్రవారం రెండో విడత ప్రచారానికి తెర లేపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు గడపగడపనకు వెళ్లి ఓటు వేసి ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు. ఇక తాయిలాలతో ప్రసన్నం చేసుకునే
వ్యూహాలకు పదును పెట్టారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, తెదేపాతో పాటు వామపక్షలు తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నాయి. మూడో విడత పక్రియ సైతం చివరి ఘట్టానికి చేరుకోవడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ తీవ్రంగా ఉంది.ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమకే ఓటేయాలని ఓటర్ల వద్దకు వెళ్లి అభ్యర్థించారు. రాత్రి వేళల్లో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ పెద్దలు రంగంలోకి దిగడంతో పరిషత్ వాతావరణం రాజుకుంటోంది. ఓటర్ల ప్రసన్నానికి రాజకీయ పార్టీలు శక్తియుక్తుల్ని దారపోస్తున్నాయి. ఈ దఫా ఎన్నికలు ఖరీదుగానే కనిపిస్తున్నాయి. పగలు ప్రచారం చేసిన నేతలు రాత్రి సమయాల్లో సాయంత్రాలు గ్రామాల్లో ప్రజలను కలుసుకుని వారి మనోగతాలు తెలుసుకుని బుజ్జగింపులతో బుట్టలో వేస్తున్నారు. కీలకంగా చక్రం తిప్పే ప్రముఖులతో మంతనాలు చేస్తూ ఓట్లగాలంపై దృష్టి సారిస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా సామాజిక వర్గాల వారీగా ఎంత మంది ఉన్నారో లెక్కగడుతున్నారు. ఆ వర్గానికి పెద్దమనిషి ఏవరో తెలుసుకుని అతని వద్దకు వెళ్తున్నారు. విూ ఓట్లు ఇన్ని ఉన్నాయి, అవి తమ పార్టీకే వచ్చేందుకు విూ సహాయ సహకారాలు అందించాలంటూ కోరుతున్నారు. అలాగే కుల, పరపతి, పురుషుల, మహిళా సంఘాల చీటీల సమావేశాలు కూడా జరుగుతుంటాయి. ఆ సంఘాల సభ్యులనూ కలుస్తున్నారు. తమ వారిని గెలిపిస్తే విూ గ్రామానికి ఏం చేస్తామో చెప్పకనే చెబుతున్నారు. ఇతర పార్టీల బలాలను సైతం బేరీజు వేస్తూ పావులు కదుపుతున్నారు. మొత్తంగా పరిషత్ పోరు ప్లలెలను ¬రెత్తిస్తోంది. మండే ఎండలను
దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఉదయమే ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం ఐదుగంటలకే పల్లెలకు చేరుకోవడం ఇంటింటికీ వెళ్లి మమ్మల్ని గుర్తుంచు కోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ పీఠాలపై కన్నేసిన ప్రధాన వారు.. కీలక నేతలను సైతం రంగంలోకి దించారు. ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఉదయం 10 గంటల వరకే ప్రచారాన్ని ముగించుకోవడంతో పాటు మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు మంతలనాలు చేస్తున్నారు. పలు స్థానాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్రులూ ప్రచారంలో ముందుండటంతో అభ్యర్థుల్లో గుబులు నెలకొంటోంది.
తొలివిడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఊపందుకున్న ప్రచారం




