Tuesday, 3 November 2026

తొలి టెస్టులో భారత్‌ విజయం

చెన్నై : భారత్‌  – ఆస్ట్రేలియాల మధ్య చెన్నై వేదికగా జరిగిన తొలిటెస్టులో ధోని సేన 8 వికెట్ల తేడాతో విజయం ఢంకా మోగించింది.ఆసీన్‌ విధించిన 50 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. 232/9 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 241 పరుగులకు కుప్పకూలింది. కెన్రీక్యూన్‌ (81) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. లక్ష్య చేదనలో భాగంగా బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ మొదట్లో తడబడి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. విజయ్‌ 6, సెహ్వాగ్‌ 19 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్‌ వచ్చిన పుజారా 8,  సచిన్‌ 13 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. రెండో టెస్టు మార్చి 2 నుంచి హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

స్కోరు వివరాలు

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్‌స : 380

భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ : 572

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 241

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 50/2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *