Thursday, 5 November 2026

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

మెల్బోర్న్: భారత్ నిర్దేశించిన 308 పరుగుల లక్షంతో దక్షిణాఫ్రికా బరిలో దిగింది. సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (7) .. షమీ బౌలింగ్లో కోహ్లీకి దొరికిపోయాడు. సఫారీలు ప్రస్తుతం 3.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేశారు. మరో ఓపెనర్ ఆమ్లాకు తోడు డుప్లెసిస్ బ్యాటింగ్కు వచ్చాడు.

ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ధవన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2  సిక్సర్లతో 137) ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపితే.. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *