హైదరాబాద్,సెప్టెంబర్ 15,(జనంసాక్షి):రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా డా. ఎస్. రాజాసదారాం, కమిషనర్‌గా బుద్దా మురళి నియమితులయ్యారు. సమాచారం కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్షనేత జానారెడ్డి సభ్యులుగా పాల్గొన్న కమిటీ ఈ మేరకు రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్‌ను ఎంపికచేసింది. ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ కు పంపించింది. కమిటీ ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు.




