త్యాగశీలి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: గొట్టిముక్కల వెంగళరావు…
కూకట్ పల్లి జనంసాక్షి : తెలంగాణ ప్రదాత ఏఐసీసీ అగ్రనేత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో కూకట్ పల్లి డివిజన్ లో శుక్రవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ప్రదాత త్యాగశీలి తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన సోనియా గాంధీకి తెలంగాణ సమాజం రుణపడి ఉందని, రాబోవు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీకి బహుమతి అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




