Thursday, 5 November 2026

సోనియా గాంధీ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం.

సోనియా గాంధీ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం…..

తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ ఋణం తీర్చుకొనే సమయం ఆసన్నమైంది – డా. సత్యం శ్రీరంగం….

కూకట్ పల్లి జనంసాక్షి : ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా శుక్రవారం కూకట్ పల్లి నియోజక వర్గం బాలాజీ నగర్ డివిజన్ వివేక్ నగర్ లోని ప్రాధమిక పాఠశాలలో టీపీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం విద్యార్థులకు పుస్తకాలు,పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం బోయినపల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అనంతరం సత్యం శ్రీరంగం మాట్లాడుతూ సోనియా గాంధీ 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తమ పుట్టిన రోజున రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన సోనియా గాంధీ తెలంగాణ దేవత అన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాలేదని సోనియా గాంధీ త్యాగ ఫలితమే తెలంగాణ అన్నారు. ఆమె త్యాగం, సేవలు మరిచిపోలేమని గుర్తు చేసారు. యువత, నిరుద్యోగుల బలిదానాలకు ముగింపు పలకాలని ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన గొప్ప మానవతావాది సోనియా గాంధీ అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూము వేణు, కృష్ణ రాజపుత్, జహంగీర్, కృష్ణ చైతన్య, ఉపాధ్యాయురాలు తులసి, ప్రత్యూష, శారద, షాబా తదితరులు పాల్గొన్నారు.