Tuesday, 3 November 2026

సైదాపూర్ లో బక్రీద్ వేడుకలు. త్యాగానికి ప్రతీక మానవ విశ్వాసానికి దైవ పరీక్ష బక్రీద్. ఈదుల్ అజ్ హా

సైదాపూర్: జూన్ :29: జనం సాక్షి సైదాపూర్ మండల కేంద్రంలోని ఈదుగా లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అంగరంగ వైభవముగా జరుపుకున్నారు అనంతరం జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ హజ్రత్ ఇబ్రహీం హలేయి సలాం ఆయన సతీమణి హజీరాకు వారి వృద్ధాప్యంలో అల్లా వారికి లేక లేక సంతాన ప్రాప్తి కలిగించారు హ జీరాకు తమ కుమారుడు అయిన ఇస్మాయిల్ జన్మించారు ఇబ్రహీం హలేయి సలాం కు అల్లా అనేక రకములైన పరీక్షలను పెట్టాడు ఒక రోజున ఇబ్రహీం అలేయి సలాం ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అల్లా తన కలలో కనపడి నాకు నీ కుమారుడు అయిన ఇస్మాయిల్ని కురుబాని ఇవ్వాలి అని చెప్పగా అల్లా పేరిట బలిదానం చేస్తున్నట్లు కలగంటాడు దీనితో అల్లా తన కుమారుడైన ఇస్మాయిల్ ను బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ ను బలిదానం ఇచ్చేందుకు సిద్ధపడతాడు తన తండ్రి అంతరంగాన్ని గ్రహించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లా మార్గంలో బలి అయ్యేందుకు సిద్ధపడతాడు బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డు వస్తే తన బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే అల్లా తో అవిశ్వాస ఘాతకుడిగా నిలవ కుండా ఉండాలని భావించి తన కనులకు గంతలతో తనను కట్టి బలి ఇవ్వమంటూ తన తండ్రి అయిన ఇబ్రహీం కు తెలియజేస్తారు ఆ మేరకు అల్లా నామ స్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు ఇబ్రహీం సిద్ధం కాగా ఇబ్రహీం తన కొడుకు ఇస్మాయిల్ గొంతు పై కత్తి పెట్టిన క్షణంలో ఆ కత్తి పూలమాలగా ఇస్మాయిల్ మెడలో పడుతుంది త్యాగ నిరతకి మెచ్చిన అల్లా ఆఖరు క్షణంలో తన కొడుకు అయినా ఇస్మాయిల్ ను తప్పించి అదే స్థానంలో ఒక పొట్టేలును ప్రత్యక్ష పరుస్తారు దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గంలో అది కుర్బాన్ గా అవుతుంది ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజ్ హా లేదా బక్రీద్ అని పిలుస్తారు భక్తి త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని తమకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులకు పంచి పెట్టడాన్ని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు ఇస్లాం ధర్మం అంటే శాంతి అహింస దయా కరుణా ప్రేమ ఐకమత్యం మానవత్వానికి చిహ్నమని తెలిపారు బక్రీద్ పండుగ ముందు ముస్లింలు పవిత్రమైన మొక్క అజ్ యాత్ర కు వెళ్లడం సాంప్రదాయంగా భావిస్తారని కాబాతుల్ల చుట్టూ ఏడూ ప్రదక్షిణలు చేస్తారని తెలిపారు కురుబాని ఇచ్చిన వారు ఆ యొక్క కురుబానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగం తమ కుటుంబం కోసం రెండవ భాగం నిరుపేదల కోసం మూడో భాగం ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలని కురాన్ గ్రంథంలో ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ.ఎండి జాఫర్. ఎండి సత్తార్. ఎండి రజాక్. ఎండి రఫీ. ఎండి గౌస్. ఎండి సలీం. ఎండి సమీర్.సయ్యద్ లాలు. సయ్యద్ చాంద్. సయ్యద్ సలీం. సయ్యద్ ముజీర్. సయ్యద్ నజీర్. మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు