త్రాగునీటి సమస్యలు తీర్చుటకై బొర్వెల్-ఎంపిపి

పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెంది వాటి రూపురేఖలు మారుటకై నిరంతరం పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతైనా అవసరమని దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మంగళవారం రోజున పల్లె ప్రగతి పథంలో భాగంగా మండలంలోని కుంటాల (బి) గ్రామానికి సందర్శించి ఆ గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.గ్రామ సర్పంచు మా గ్రామ ప్రజల త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరాగా ఎంపీపీ వెంటనే స్పందించి కుంటాల (బి)గ్రామంలో ఎంపిపి నిధులతో బోర్వెల్ వేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గ్రామస్థులకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా బొర్వెల్ వేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్ అడ సుజాత గ్రామ పటేల్ మాణిక్ రావు దేవారి బుజంగ్ రావు మహాజన్ గంగారాం
బుగ్గారాం సర్పంచ్ సుభాష్ కిస్టపుర్ సర్పంచ్ గీత కరణ్  గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.