అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,041 పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేరుకుంటున్నారు. 18 వేల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గోంటున్నారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా … వివిధ పార్టీల నుంచి 249 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా వామపక్ష కూటమి, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.




