బోనగిరి టౌన్ జనం సాక్షి:–త్రిబుల్ ఆర్ అలైన్ మెంటును మార్చాలని కోరుతూ రైతులు మంగళవారం భువనగిరి వరంగల్ ( కలెక్టరేట్) జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి కమిటీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ మాట్లాడుతూ రాయగిరి గుండా పోయే త్రిబుల్ ఆర్ మార్గాన్ని మార్చి ప్రత్యయం చూడాలని కోరారు. గతంలో రోడ్డు వెడల్పు చేసినప్పుడు రాయగిరిలో రైతులు నష్టపోయారని, విద్యుత్ లైన్ వేసినప్పుడు, కాలేశ్వరం ప్రాజెక్టు కాలువలో చాలావరకు భూమిని కోల్పోయినట్లు తెలిపారు. రాయగిరి పాలిట రోడ్డు వెడల్పు విద్యుత్తు పోల్స్ వేయడం కాలువలు పోవడంతో రాయగిరి రైతులకు మిగిలింది ఏమీ లేదన్నారు. రాయగిరి రైతుల బాధలను దృష్టిలో ఉంచుకొని అలైన్మెంట్ను మార్చాలని కోరారు. భువనగిరి రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయనతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా రైతులకు బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు అవిశెట్టి పాండు యాదవ్, అంజయ్య, శంకరయ్య,రాజు లు పాల్గొన్నారు.




