Saturday, 7 November 2026

త్రిబుల్ ఐటీ విద్యార్ధి మరణానికి కారణాలు చెప్పండి

త్రిబుల్ ఐటీ విద్యార్ధి మరణానికి కారణాలు చెప్పండి…

– ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం…

భైంసా రూరల్ డిసెంబర్ 20 జనం సాక్షి

 

-బై0సా లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుప్రసాద్ మృతి ఘటనను నిరసిస్తూ నిన్న జిల్లా కేంద్రమైన నిర్మల్ లో సోమవారం విద్యార్థి సంఘాలు ఆసుపత్రిలోనున్న మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏబీవీపీ, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు పలువురు తరలి వెళ్లారు. పోలీసుఅధికారులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆసుపత్రి లోనికి వెళ్లేందుకు యత్నించారు.అయితే వారి చర్యలను పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను ఆదుపులోకి తీసుకొని పోలీ సు స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంలో పోలీసులకు ఆందోళనకారులకు తోపులాట జరిగి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనికి నిరసనగా మంగళవారం బైంసా పట్టణంలో ఏబీవీపీ మహిషా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి మరణానికి పూర్తి కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన దాడితో విద్యార్థులపై ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.విద్యార్థులకి అన్యాయం జరుగితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు