సీనియర్ సీటీజన్స్ కు ప్రభుత్వం భరోసా*
*ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.*
మెట్ పల్లి టౌన్,డిసెంబర్ 20,
జనం సాక్షి :
కేంద్రం రూపొందించిన తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ చట్టాన్ని కేంద్రము పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా పకడ్బందీ చర్యలు అమలు చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.మంగళవారం మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సీటీజన్స్,పెన్షనర్స్ అసోసియేషన్స్ ,మెట్ పల్లి కోరుట్ల డివిజన్ సంఘాల ఆధ్వర్యంలో ముద్రించిన 2023 డైరీలు,సీనియర్ సీటీజన్స్ పిలుపు మాసపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.అనంతరం సీనియర్ సీటీజన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షులు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు అభినందనలు మెమోంటో అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపున అన్ని జిల్లా కేంద్రాల్లో వృద్దాశ్రమాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి,రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ధన్యవాదాలు తెలిపారు.వృద్ధులకు పిల్లలు అండగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సీటీజన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి,కోరుట్ల డివిజన్ అధ్యక్షులు పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, కోశాధికారి లక్ష్మీనారాయణ,మెట్ పల్లి డివిజన్ సీనియర్ సీటీజన్స్ అధ్యక్షులు ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్,ఎం.డి.సైఫోద్దిన్,సీనియర్ సీటీజన్స్ ,పెన్షనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు
సీనియర్ సీటీజన్స్ కు ప్రభుత్వం భరోసా




