త్రుటిలో తప్పిన ప్రమాదం.

నెన్నెల మండలం మైలారం గ్రామ సమీపలో శుక్రవారం లారీ ఢీ కొని మూడు కరెంటు స్తంబాలు విరిగి పోయాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువ పనులు నిలిచిపోవడంతో అక్కడి సామగ్రి, పైపులు తరలిస్తున్న లారీ అదుపు తప్పి కరెంటు స్తంభాలను ఢీ కొట్టింది. ఆ సమయలో విద్యుత్ సరఫరా లేక పోవడం తో పెను ప్రమాదం తప్పింది. లారీలు అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.