Tuesday, 3 November 2026

త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌

 

కాంగ్రెస్‌ మహిళా నేత అంబికా సోని

దిల్లీ: త్వరలోనే రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ మహిళా నేత అంబికా సోని తెలిపారు. తల్లి సోనియాగాంధీ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని, ఆయన పార్టీ అధ్యక్షుడిగా వస్తారని మాకు తెలుసు, కాని దీనికి సంబంధించిన తదుపరి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని ఆమె అన్నారు. ప్రస్తుతం రాహుల్‌ వచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు మద్దతిస్తామని, ఆయనకు అండగా ఉంటామని ఇటీవలే పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రకటించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ నెల రోజుల పాటు ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా పార్టీలో రాహుల్‌గాంధీ ప్రదర్శన బాగోలేదని, నాయకత్వం లోపం ఉందని ఇటీవల కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన రీటా బహుగుణ జోషి ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *