Wednesday, 4 November 2026

త్వరలో జేఏసీతో సమావేశం: కేసీఆర్‌

కరీంనగర్‌: జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలను పెద్దది చేసి చూపించి ఉద్యమకారులను తికమకపెట్టే చిల్లర పని సీమాంధ్ర మీడియా చేస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మీడియా చేసే ప్రచారాలను చూసి ప్రజలు కస్ఫూజ్‌ కావద్దని ఆయన తెలియజేశారు. సీట్లు ఓట్ల వైపు టీఆర్‌ఎస్‌ మల్లిందని ప్రచారం చేస్తున్న సీమాంధ్ర మీడియా కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ నాయకులు ఆపార్టీలకు బానిసనలుగా ప్రవర్తిస్తున్న తీరును చూపించడంలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ ఆస్థిత్వాన్ని కలిగినప్పుడే తెలంగాణ స్వప్నం సాకారమవుతుందన్న విషయం జగమెరిగిన సత్యమని కేసీఆర్‌ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *