త్వరలో పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సూచనల మేరకు టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ (TSSPDCL) సిఎండి కార్యాలయం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారని పేర్కొన్నారు. సుమారు 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తాజావార్తలు