బెల్లంపల్లి, ఏప్రిల్ 11, (జనంసాక్షి )బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశించారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. పనుల్లో నాణ్యత లోపం లేకుండా చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, నాయకులు గెల్లి రాజలింగు, కొమ్ము సురేష్, మధు, నూనేటి సదానందం, ఎరుకల సుందర్రావు, సముద్రాల మురళి, జిలకర వాసు, రెవెల్లి విజయ్, శ్యాం, కాసర్ల యాదగిరి, దామెర కిరణ్, బాల రాజేష్, చుంచు వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.




