టేకులపల్లి,ఏప్రిల్ 11 (జనం సాక్షి): పదవ తరగతి పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ విధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపాధ్యాయులకుకేటాయించాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లాలోని అనేక మండలాలలోని పాఠశాలలు ఖమ్మం జిల్లాలోని అనేక మండలాలలోని పాఠశాలల కంటే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు చాలా దగ్గరలో ఉన్నాయని,జిల్లాలోని ఉపాధ్యాయులకు స్పాట్ వాల్యూయేషన్ విధులు కేటాయించకపోవడంతో వారు వివక్షకు గురవుతున్నట్లుగా భావించవలసి వస్తుందని,స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కొత్తగూడెం కేంద్రంగా కేటాయించకపోవడం పోగా,విధులు కేటాయించకపోవడం సరైనది కాదని,దీనిపై అధికారులు వెంటనే నిర్ణయం తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అర్హత గల,ఆసక్తి గల ఉపాధ్యాయులందరికీ స్పాట్ వాల్యుయేషన్ విధులు కేటాయించాలని ఆయన అన్నారు. లేనియెడల విధులు కేటాయించే వరకు ఉద్యమిస్తామని మంగళవారం కోయగూడెంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా కావడంతో ఈ జిల్లాలోని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులపై చిన్న చూపు ఉన్నదని భావించవలసి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం కేటాయించబడినప్పుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయులు అందరికీ సమాన నిష్పత్తిలో స్పాట్ వేల్యూషన్ విధులు కేటాయించవలసి ఉండగా, ఇక్కడి ఉపాధ్యాయులపై చిన్న చూపు ఎందుకని వారు ప్రశ్నించారు.వెంటనే ఇక్కడి అన్ని యాజమాన్యాలలోని ఉపాధ్యాయులకు విధులు కేటాయించి తారతమ్య భేదాలు లేకుండా




