మార్పు బాలకృష్ణమ్మకు టిఆర్టిఎఫ్ ఘన నివాళి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అప్రయత్న పదోన్నతి పథకం వంటి అనేక ఉపాధ్యాయ, ఉద్యోగ ప్రయోజన ఉత్తర్వులను అందించడంలో ప్రజా ఉద్యమ నేత మార్పు బాలకృష్ణమ్మ కృషి ఎనలేనిదని టిఆర్టిఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్ అన్నారు.గురువారం మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి జరిగిన అనేక ఉపాధ్యాయ, విద్యారంగా పోరాటాలలో ముందుండి నడిచిన వ్యక్తి మార్పు బాలకృష్ణమ్మ అని అన్నారు.ఉపాధ్యాయ సంక్షేమానికి వారు చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు.రైతాంగ పోరాటం, సాగునీరు, తాగునీరు పోరాట కార్యక్రమాల ద్వారా ప్రజాపోరాట యోధులుగా పేరు గడించారని అన్నారు.రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్న జీవితకాలంలో ఒక జానెడు జాగాను సమకూర్చుకోలేకపోయారని, కానీ తరగతికి ఒక తరగతి గది, అన్ని పాఠశాలల భవనాల కోసం, బడుగు బలహీన వర్గాల పిల్లల విద్య కోసం ఆయన జీవితాంతం శ్రమించారని కొనియాడారు.జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ మార్పు బాలకృష్ణమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆశయ సాధనలో ముందుకు సాగడమే వారికిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి , రాష్ట్ర సీనియర్ నాయకులు ఎక్బాల్ అహమ్మద్, ప్రదీప్ కుమార్, ఉపేందర్ రెడ్డి , వాసు , గురవయ్య , వీరారెడ్డి , శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




