Thursday, 5 November 2026

దత్తగిరి ఆశ్రమం లో ఘనంగా దత్తాత్రే డోలారోహణం

దత్తగిరి ఆశ్రమం లో ఘనంగా దత్తాత్రే డోలారోహణం
జహీరాబాద్ డిసెంబర్ 8 (జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురువారం శ్రీ దత్త జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మేలుకొలుపు, స్వామి వారికి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యావాచనము, స్వస్తివాచనము, రుత్విక్ వరణము, గణపతి ఆవాహనం, మధ్యాహ్నము రుద్ర సహిత దత్త యజ్ఞం పుపూర్ణాతి నిర్వహించారు. మాతృశ్రీ అనసూయ మాత ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి డోలారోహణం నిర్వహించారు. వివిధ ప్రాంతాలను వచ్చిన మహిళా భక్తులు స్వామివారికి జోల పాటలు పాడారు. శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ 21 గుండములలో రుద్ర సహిత దత్త యజ్ఞం, ఓం నమశ్శివాయ శతకోటి జపం, వేదమంత్రాలతో ఆశ్రమ పరిసరాలు మారుమోగాయి. వివిధ ప్రాంతాలను వచ్చిన భక్తులు దత్తాత్రేయ, అత్రి అనసూయ, పంచవృక్షాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నరు. ఈ కార్యక్రమంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ శికామణి అవధూత గిరి మహారాజ్, నారాయణఖేడ్ కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్, ధనశ్రీ ఆశ్రమ పీఠాధిపతి శివాచార్య మహరజ్, సిద్దేశ్వర ఆనంద్ గిరి మహారాజ్ జహీరాబాద్, నారాయణఖేడ్, ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.